e film is also a follow up to the 2005 Tamil film, Chandramukhi, also directed by Vasu, which was dubbed and released in Telugu.

లైలా తుపాన్ సినీ పరిశ్రమను కూడా ఓ కుదుపు కుదిపేసింది. పలు చిత్రాలు మంచి రన్నింగ్ కండీషన్‌లో ఉన్నాయనుకుంటున్న సందర్భంలో లైలా తాకిడి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. అంతేగాక కోస్తా తీరంలో షూటింగ్ జరుపుకుంటున్న వెంకీ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. దాని వివరాలిలా ఉన్నాయి... "చంద్రముఖి" చిత్రానికి సీక్వెల్‌గా హీరో వెంకటేష్ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. "నాగవల్లి" అనే పేరు నిర్ణయించినట్టు ఇండిస్టీ సమాచారం ! దీని షూటింగ్ విజయనగరం జిల్లాలో జరుగుతోంది. దీనికోసం కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ సెట్ అక్కడ వేసారు. హీరో వెంకటేష్ మరియు ఇతర నటీనటులపై ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ దర్శకుడు పి.వాసు జరుపుతున్నారు. ఒక్కసారిగా లైలా తుపాన్ కోస్తా తీరాన్ని తాకడంతో వేసిన సెట్ మొత్తం ఆనవాళ్లు లేకుండా దెబ్బతింది. దాంతో షూటింగ్ ఆగిపోయింది. మరో కొత్త సెట్ వేయడానికి నిర్మాత బెల్లకొండ సురేష్ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారంట ! మరికొద్దిరోజుల్లో తిరగి షూటింగ్ ప్రారంభించనున్నారని వినికిడి.



0 Response to "e film is also a follow up to the 2005 Tamil film, Chandramukhi, also directed by Vasu, which was dubbed and released in Telugu."
Post a Comment